KTR : కేటీఆర్ ఇక పాదయాత్ర... పార్టీకి హైప్ తెస్తుందా? పాత ఫార్ములా పనిచేస్తుందా?

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చే ఏడాది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయనున్నారు.;

Update: 2025-03-21 12:27 GMT
ktr, brs working president , padayatra, ts politics
  • whatsapp icon

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చే ఏడాది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయనున్నారు. ఇందుకోసం రూట్ మ్యాప్ ను కూడా పార్టీ వర్గాలు సిద్ధం చేస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ 2026లోనే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని కేటీఆర్ నిర్ణయించారు. పాదయాత్రతో పార్టీకి హైప్ తేవాలని ఆయన నిర్ణయించారు. నేతలు కొంత డైలమాలో ఉన్నప్పటికీ పార్టీ క్యాడర్ మాత్రం కసి మీద ఉన్నారు. కానీ వారిని నియోజకవర్గాల్లో మార్గదర్శనం చేసే వారు లేక పెదవి విప్పలేకపోతున్నారు. ఆందోళన చేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ తాను పాదయాత్ర ద్వారా క్యాడర్ లో జోష్ నింపడమే కాకుండా నేతలను కూడా యాక్టివేట్ చేయాలని భావిస్తున్నారు.

కేసీఆర్ బయటకు రాకపోవడంతో...
పార్టీ అధినేత కేసీఆర్ బయటకు రారు. ఆయన ఎప్పుడైనా వచ్చినా అలా వచ్చి ఇలా వెళ్లిపోతారు. వయసు కావచ్చు. నిర్వేదం కావచ్చు. ఓటమి నుంచి ఇంకా ఆయన తేరుకోలేక ఫాం హౌస్ కే పరిమితమయ్యారు. కేసీఆర్ కు ఉన్న డిజడ్వాంజేదీ అదే. ఆయన నియోజకవర్గంలో కూడా పర్యటించే ఓపిక ఉండదు. అలాంటి సమయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా తాను పార్టీకి పూర్తి స్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా కేటీఆర్ పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయన సూర్యాపేట జిల్లాలో జరిగిన బీఆర్ఎస్ ముఖ్యనేతల సమావేశంలో ప్రకటించారు. పాదయాత్ర కు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే కేటీఆర్ అధికారికంగా ప్రకటించే అవకాశముంది.
పార్టీలో మార్పులు చేసి...
పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల తర్వాత పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. పాదయాత్ర ప్రారంభం అయ్యే లోపు కొత్త కమిటీలను నియమించనున్నారు. కమిటీల్లో పార్టీ లో చురుగ్గా పాల్గొనే వారిని ఎంపిక చేసి వారికి అధికారంలోకి వస్తే మంచి రాజకీయ భవిష్యత్ అందించనున్నామని తెలపనున్నారు. గ్రామ స్థాయి నుంచి వార్డు, బూత్ స్థాయులతో పాటు రాష్ట్ర స్థాయి కమిటీలను నియమించనున్నారు. ఈ రెండేళ్లు పార్టీ కోసం పనిచేసిన వారికి పదవులు ఇవ్వాలన్న యోచనలో కేటీఆర్ ఉన్నారు. ఆ తర్వాత మాత్రమే పాదయాత్ర చేపట్టాలని, పాదయాత్ర ప్రారంభించిన తర్వాత ఇక ఒకసారి హైదరాబాద్ నుంచి బయలుదేరి విరామం లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని కేటీఆర్ నిర్ణయించారు.
గతంలో పాదయాత్ర చేసి...
గతంలో పాదయాత్ర చేసి అనేక మంది అధికారంలోకి వచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్రలు చేసి అధికారంలోకి వచ్చారు. అలాగే రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా కాంగ్రెస్ నేతలు విడతల వారీగా పాదయాత్రలను నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ లోనూజగన్ పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయ్యారు. లోకేశ్ కూడా గత ఎన్నికలకు ముందు యువగళం పేరుతో పాదయాత్ర చేసి పార్టీకి హైప్ తెచ్చి అధికారంలోకి రావడంలో కీలకంగా మారరు. దీంతో అదే ఫార్ములాను పాటించాలని కేటీఆర్ నిర్ణయించారు. ఎక్కడి నుంచి బయలుదేరి, ఎక్కడ ముగించాలన్నది త్వరలోనే నిర్ణయించి రోడ్డు మ్యాప్ ను రూపొందించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.


Tags:    

Similar News