ఏడున్నరేళ్లుగా కేంద్రం చేసిందేమీ లేదు

తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని మంత్రి కేటీఆర్ తప్పుపట్టారు

Update: 2022-01-31 06:59 GMT

తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని మంత్రి కేటీఆర్ తప్పుపట్టారు. ఏడున్నరేళ్ల నుంచి తెలంగాణకు కేంద్రం నుంచి ఎటువంటి సహకారం అందలేదని కేటీఆర్ అన్నారు. అంతర్జాతీయ ప్రముఖ సంస్థ డ్రిల్ మెక్ తో తెలంగాణ ప్రభుత్వం నేడు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నా కేంద్రం మాత్రం ఎటువంటి సాయం అందించడం లేదని ఆరోపించారు.

విభజన హామీలు....
రాష్ట్ర విభజన హామీలు అమలు చేయకపోగా, తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు రాయితీలు ఎన్నో కల్పిస్తున్నా కేంద్రం నుంచి సాయం అందడం లేదని చెప్పారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లకు ప్రత్యేకంగా పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాకతీయ, మెగా టెక్స్ టైల్ పార్క్, ఫార్మా సిటీకి కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిన నిధులు ఇంతవరకూ తమకు అందలేదని కేటీఆర్ చెప్పారు. రాష్ట్రాలకు నిధులు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం పక్షపాత వైఖరిని ప్రదర్శిస్తుందని కేటీఆర్ కేంద్రంపై ఫైర్ అయ్యారు.


Tags:    

Similar News