సీసీఐ పునరుద్ధరణ కోసం కేంద్రంపై వత్తిడి
సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పునరుద్ధరణ కోసం కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తీసుకువస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పునరుద్ధరణ కోసం కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తీసుకువస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. అవసరమైతే ఆందోళనకు దిగాలని నిర్ణయించారు. ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చిన నేతలు కేటీఆర్ ను కలసిన సందర్బంగా సీసీఐ అంశం ప్రస్తావనకు వచ్చింది. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పునరుద్ధరణ కోసం ప్రభుత్వం నుంచి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు.
అవసరమైతే ఢిల్లీకి....
సీసీఐ పునఃప్రారంభానికి అవసరమైతే ప్రత్యేక రాయితీలను కూడా ఇస్తామని, కొత్త కంపెనీలకు ఇచ్చే రాయితీలే దీనికి కూడా వర్తింప చేస్తామని కేటీఆర్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించడానికే మొగ్గు చూపుతుందని, అందరం కలసి వత్తిడి తెచ్చి సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పునరద్ధిరించేందుకు శ్రమిద్దామని కేటీఆర్ కోరారు. అవసరమైతే ఢిల్లీకి వెళ్లి వత్తిడి తెచ్చేందుకు ప్లాన్ చేద్దామని ఆదిలాబాద్ జిల్లా నేతలకు కేటీఆర్ తెలిపారు.