మా కంటే వాళ్లకు ఎవరు మేలు చేస్తారు?
తెలంగాణ ఉన్నది రైతు ప్రభుత్వమని మంత్రి కేటీఆర్ అన్నారు. సంక్రాంతి వరకూ రైతు బంధు సంబరాలు కొనసాగుతాయని చెప్పారు.
తెలంగాణ ఉన్నది రైతు ప్రభుత్వమని మంత్రి కేటీఆర్ అన్నారు. సంక్రాంతి వరకూ రైతు బంధు సంబరాలు కొనసాగుతాయని చెప్పారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ రైతులు ఎంతో నష్టపోయారన్నారు. ఇప్పుడు రైతుల్లో దర్జాతో పాటు భూమి ధర పెరిగిందని చెప్పారు. టీఆర్ఎస్ అంటేనే తెలంగాణ రైతు సర్కార్ అని కేటీఆర్ అన్నారు. భూగర్భ జలాల సంరక్షణలో తెలంగాణ దేశానికే ఆదర్శప్రాయమని అన్నారు.
గత ప్రభుత్వాలన్నీ.....
గత ప్రభుత్వాలన్నీ అన్నం పెట్టిన రైతులకు సున్నం పెట్టినవేనని కేటీఆర్ అన్నారు. రైతు శ్రేయస్సు కోసం తమ ప్రభుత్వం అనేక పథకాలను అమలులోకి తెచ్చిందన్నారు. భూములకు నీళ్లు ఇవ్వడంతో అన్ని పంటలు పండించే పరిస్థితికి తెలంగాణ రైతు చేరుకున్నాడని అన్నారు. వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిందన్నారు. రైతు బంధు పథకం దేశానికే ఆదర్శనీయమని కేటీఆర్ తెలిపారు. పాలమూరు జిల్లా నుంచే గతంలో పదిహేను లక్షల మంది వలసపోయేవారని, ఇప్పుడు అవి ఎక్కడ అని ప్రశ్నించారు. రైతు ఆత్మహత్యలు కూడా గణనీయంగా తగ్గాయని చెప్పారు.