అందుకే విశాఖ స్టీల్ ప్లాంట్ కొనాలనుకుంటున్నాం

విశాఖ స్టీల్ ప్లాంట్ ను అదానీ నుంచి రక్షించడానికే కొనుగోలు చేయాలని నిర్ణయించామని మంత్రి కేటీఆర్ అన్నారు.

Update: 2023-04-11 07:06 GMT

ప్రభుత్వ రంగ సంస్థలను ఎలా బలోపేతం చేయాలన్న దానిపై కేసీఆర్ నిరంతరం ఆలోచిస్తుంటారని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎల్్ఐసీ ద్వారానే రైతు బీమా చేయించన నేత కేసీఆర్ అని అన్నారు. మాటల ద్వారా కాకుండా చేతల ద్వారా చూపించిన ఘనత కేసీఆర్ అని అన్నారు. దానివల్ల కార్మిక, ఉద్యోగులు అభద్రతకు లోను కారరని ఆయన అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలకు కేసీఆర్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కొనుగోలు విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని చెబితే బయ్యారం విషయంలో ఎందుకు చొరవ చూపించడం లేదని బండి సంజయ్ చేసిన విమర్శలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. బండి సంజయ్ ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం వెనక భారీ కుట్ర ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే పోర్టులన్నీ అదానీ పరమయ్యాయన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కున్న కోట్లాది ఆస్తులను కాజేయడానికే పెద్దలు కన్నేశారని అన్నారు.

ఆ ఇద్దరికీ కట్టబెడతారనే...
విశాఖ ఉక్కుకు, బయ్యారం స్టీల్ ప్లాంట్ తో పోలిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ భారీగా ఐరన్ ఓర్ ఉన్న గని అని అన్నారు. బయ్యారం 150 కిలోమీటర్ల దూరంలో ఉంటే, విశాఖ 600 కిలో మీటర్ల దూరంలో ఉందని అన్నారు. నష్టాలను అందరికీ పంచి, లాభాలను కొందరికే పంచడం తమ ఆలోచన కాదన్నారు. బయ్యారం, కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని చేేపట్టాలని విభజన చట్టంలోనే ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వమే బయ్యారం స్టీల్ ప్లాంట్ ను నిర్మించాలన్నారు. కానీ కేంద్రమంత్రులను కలిసినా ఎలాంటి ఫలితం లేదన్నారు. బయ్యారం స్టీల్ ప్లాంట్ పెడితే పదిహేను నుంచి ఇరవై వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పినా కేంద్రప్రభుత్వం వినలేదన్నారు. బయ్యారం స్టీల్ ప్లాంట్ ను మళ్లీ అదానికే అప్పగించాలని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను బలవంతంగా నష్టాల్లోకి నెట్టి వేసి బలవంతంగా అదానీకి కట్టబెట్టాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేటీఆర్ అన్నారు. ప్రధాని, అదాని కలసి తెలుగు రాష్ట్రాల సంపదను కొల్లగొట్టాలని ప్రయత్నిస్తున్నారని, అందుకే తమ ప్రభుత్వం కొనుగోలు చేయడానికి సిద్ధమయిందని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల వనరులను కొట్టేసి జాతి సంపదను ఆ ఇద్దరికీ దోచిపెట్టడానికే ప్రయత్నం జరుగుతుందన్నారు. అంతే తప్ప ఏపీలో రాజకీయాల కోసం తాము విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లలో పాల్గొనాలని నిర్ణయించామని తెలిపారు.


Tags:    

Similar News