జగన్ నాకు పెద్దన్న వంటి వారు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో తమకు చక్కటి సంబంధాలున్నాయని, ఎటువంటి పంచాయతీలు లేవని మంత్రి కేటీఆర్ తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనకు పెద్దన్న లాంటి వారని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ఒక న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీ జగన్ తో తమకు ఎటువంటి విబేధాలు లేవన్నారు. ఏపీ ప్రభుత్వంతో కూడా ఎటువంటి పంచాయతీ లేదన్నారు కేటీఆర్. చక్కటి సంబంధాలు నేటికీ జగన్ తో కొనసాగుతున్నాయని కేటీఆర్ తెలిపారు. చంద్రబాబుతో కూడా తమకు ఎటువంటి విభేదాలు లేవన్నారు.
విభజన అంశాలు....
రాష్ట్ర విభజన తర్వాత కొన్ని అంశాలను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాల్సి ఉందని, అంతే తప్ప జగన్ తో గాని, ఏపీ సర్కార్ తో కూడా ఏ అంశంలోనూ తమకు విభేదాలు లేవని చెప్పారు. పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు నెలకొల్పడమే తమ ప్రభుత్వ విధానమన్నారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో తమ సత్సంబంధాలను కోరుకుంటున్నామని కేటీఆర్ చెప్పారు. జగన్ తో తమకు ఎటువంటి విభేదా లేవని, చంద్రబాబుతోనూ అంతేనని, కానీ ఆయన తమ ప్రత్యర్థులతో చేతులు కలిపి ఏదో ఊహించుకుంటున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.