మంత్రి కేటీఆర్ కు తృటిలో తప్పిన పెనుప్రమాదం

బహిరంగ సభ కోసం ఏర్పాటు చేసిన టెంట్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. బుధవారం మధ్యాహ్నం రేగిన గాలిదుమారానికి..

Update: 2022-04-20 09:17 GMT

వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ కు తృటిలో పెనుప్రమాదం తప్పింది. బుధవారం వరంగల్ జిల్లా పర్యటనకు వెళ్లిన కేటీఆర్.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆయన వరంగల్ లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొనాల్సి ఉంది. కానీ.. ఆయన అక్కడకు చేరుకోడానికి గంట ముందు ప్రమాదం జరిగింది.

బహిరంగ సభ కోసం ఏర్పాటు చేసిన టెంట్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. బుధవారం మధ్యాహ్నం రేగిన గాలిదుమారానికి ఈ ప్రమాదం జరిగింది. గాలుల ధాటికి కేటీఆర్ బహిరంగసభ టెంట్లు కూలిపోయాయి. కేటీఆర్ సభకు రాకముందే ప్రమాదం జరగడంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. బహిరంగసభ మొదలయ్యాక ఈ ప్రమాదం జరిగి ఉంటే.. కేటీఆర్ సహా.. చాలా మంది నేతలు, భారీ సంఖ్యలో హాజరైన ప్రజలపై టెంట్లు కూలి గాయాలపాలయ్యేవారు.


Tags:    

Similar News