రైతుల కోసం ధరణి కొత్త యాప్
రైతుల కోసం ధరణి కొత్త యాప్ ను ప్రభుత్వం తీసుకు వస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసులురెడ్డి తెలిపారు;
రైతుల కోసం ధరణి కొత్త యాప్ ను ప్రభుత్వం తీసుకు వస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసులురెడ్డి తెలిపారు. ధరణి కొత్త యాప్ సామాన్య ప్రజలకు చాలా ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మీడియాతో మాట్లాడిన పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి అర్హులైన పేదలకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు కేటాయింపు జరుగుతుందని తెలిపారు.
అందరికీ ఇళ్లు...
ఇందిరమ్మ ఇళ్లు ఒక విడత మాత్రమే ఇచ్చి ఊరుకోమని, ప్రజా పాలనలో ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు అడిగారో వారందరిలో అర్హులను గుర్తించి అందరికీ ఇళ్లను మంజూరు చేస్తామని చెప్పారు. తొలి విడత మాత్రం సొంత స్థలం ఉన్న పేదలకు ప్రాధాన్యత ఇస్తామని, నిరుపేదలకే ఇళ్ల కేటాయింపు జరుగుతుందని ఆయన చెప్పారు. ఇంటి నిర్మాణం కోసం కేటాయించే ఐదు లక్షల రూపాయలు నాలుగు విడతలుగా అందచేస్తామని తెలిపారు.