రాజ్ భవన్ కు మంత్రి సబిత
రాజ్ భవన్ కు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెళ్లారు. అధికారులతో కలసి సబిత గవర్నర్ ను కలుసుకునేందుకు వెళ్లారు
రాజ్ భవన్ కు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెళ్లారు. అధికారులతో కలసి సబిత గవర్నర్ ను కలుసుకునేందుకు వెళ్లారు. ప్రధానంగా యూనివర్సిటీల్లో టీచర్లు, నాన్ టీచర్ల నియామకానికి సంబందించి కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు ఏర్పాటుపై గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె కొన్ని సందేహాలు వ్యక్తం చేశారు. దీనిపై యూజీసీతో పాటు అధికారుల క్లారిటీ కూడా కోరారు.
గవర్నర్ విమర్శలతో...
నిన్న మీడియా సమావేశం పెట్టి మరీ గవర్నర్ తమిళి సై ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దీంతో ఈరోజు సబిత ఇంద్రారెడ్డి గవర్నర్ అపాయింట్ మెంట్ ను కోరారు. గవర్నర్ అపాయింట్ మెంట్ ఇవ్వడంతో సబితా ఇంద్రారెడ్డి అధికారులతో కలసిి రాజ్ భవన్ కు వెళ్లారు. ఆమెతో భేటీ అయ్యారు. కామన్ రిక్రూట్ మెంట్ బోర్డుపై గవర్నర్ కు మంత్రి, అధికారులు క్లారిటీ ఇవ్వనున్నారు.