గండ్ర దంపతులకు కోవిడ్.. ఆందోళనలో మంత్రులు
టీఆర్ఎస్ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, ఆయన భార్య జడ్పీ చైర్ పర్సన్ అయిన గండ్ర జ్యోతి లకు
తెలంగాణలో కోవిడ్, ఒమిక్రాన్ లు తీవ్రరూపం దాల్చుతున్నాయి. రెండు రకాల వేరియంట్లు శరవేగంగా విజృంభిస్తూ.. రాష్ట్ర ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు, ఉన్నత అధికారులు, పోలీసులు, వైద్యులు సైతం వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, ఆయన భార్య జడ్పీ చైర్ పర్సన్ అయిన గండ్ర జ్యోతి లకు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఇప్పుడు మంత్రులు, ఇతర నేతల్లో ఆందోళన మొదలైంది.
ఇటీవలే పంట నష్టంపై మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్, ఇతర నేతలతో కలిసి గండ్ర దంపతులు పరకాల నుంచి నర్సంపేటకు హెలికాఫ్టర్లో వెళ్లారు. నిన్న ఇద్దరికీ జ్వరం రావడంతో.. కరోనా నిర్థారణ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ గా తేలింది. తమతో సన్నిహితంగా ఉన్న నేతలు, కార్యకర్తలు కోవిడ్ టెస్ట్‌లు చేయించుకోవాలని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు గండ్ర దంపతులు.