జైలు నుంచి విడుదల
ఎమ్మెల్యే రాజాసింగ్ బెయిల్ పై చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి విడుదలయి ఆయన ఇంటికి చేరుకున్నారు
ఎమ్మెల్యే రాజాసింగ్ బెయిల్ పై చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు. కొద్దిసేపటి క్రితం ఆయన జైలు నుంచి విడుదలయి ఆయన ఇంటికి చేరుకున్నారు. జైలు వద్ద కుటుంబ సభ్యులు ఆయనకు స్వాగతం పలికారు. జైలు నుంచి విడుదయిన సందర్భంగా ఎలాంటి ర్యాలీలు తీయవద్దని హైకోర్టు ఆదేశించింది.
షరతులు ఉల్లంఘించవద్దని...
అదే సమయంలో ఊరేగింపులతో పాటు ఉపన్యాసాలు కూడా చేయవద్దని హైకోర్టు షరతు విధించింది. దీంతో రాజాసింగ్ తన కుటుంబ సభ్యులతో కలసి నేరుగా గోషామహల్ లోని తన ఇంటికి బయలుదేరి వెళ్లారు. 57 రోజుల పాటు రాజాసింగ్ జైలులో ఉన్నారు. మీడియాతో కూడా రాజాసింగ్ ఏమీ మాట్లాడకుండానే వెళ్లిపోయారు.