కేంద్రం కుట్రను తిప్పికొట్టాలి : కడియం

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ఎత్తేవేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆరోపించారు

Update: 2023-01-11 07:27 GMT

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ఎత్తేవేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆరోపించారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లను అమలు చేయాలని కోరారు. 1961 నుంచి 2021 వరకూ దేశంలో ఎస్సీ, ఎస్టీ జనాభా పెరిగిందన్న కడియం, దానికి అనుగుణంగా రిజర్వేషన్లను అమలు చేయాలని కోరారు. పెరిగిన జనాభా ప్రకారం ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు పది శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనికోరారు.

తెలంగాణ మోడల్ ను...
కానీ బీజేపీ ప్రభుత్వం అందులో విఫలమయిందని కడియం శ్రీహరి ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు పరం చేస్తే ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు వీధిన పడతరాని ఆందోళన వ్యక్తం చేశారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పంచడంలోనూ కేంద్ర ప్రభుత్వం విఫలమయిందన్న కడియం మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు మాత్రం బీజేపీ ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరిగినా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. దళితబంధును ఎక్కడా లేని విధంగా ఇక్కడ ప్రవేశపెట్టామని, తెలంగాణ మోడల్ ను దేశం కోరుకుంటుందన్నారు.


Tags:    

Similar News