రేవంత్ పై మోత్కుపల్లి ఫైర్.. కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ బెటర్ అంటూ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగల వ్యతిరేకి అని మోత్కుపల్లి నరసింహులు అన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగల వ్యతిరేకి అని మోత్కుపల్లి నరసింహులు అన్నారు. కాంగ్రెస్ మాదిగలకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదన్నారు. 80 లక్షల మంది మాదిగలు ఓట్లు వేయకుండా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందా? అని మోత్కూపల్లి ప్రశ్నించారు. కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ నయమని అన్నారు. తాను మాదిగల సంక్షేమానికి మద్దతుగా మందకృష్ణతో కలసి ధర్నా చేస్తానని మోత్కుపల్లి నరసింహులు తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణమైన మాదిగలను విస్మరించడమేంటని ప్రశ్నించారు.
మాదిగలను పక్కన పెట్టి...
రేవంత్ రెడ్డి మాదిగలను పక్కన పెడుతూ ఆ సామాజికవర్గాన్ని అన్యాయం చేస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి రాజ్యం తెస్తున్నారన్నారు. రేవంత్ వైఖరిని నిరసిస్తూ త్వరలో దీక్ష చేస్తున్నట్లు మోత్కుపల్లి నరసింహులు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలను పూర్తిగా పక్కన పెట్టిందన్నారు. మాదిగలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పనిచేస్తుందననారు. కాంగ్రెస్ మాదిగలకు క్రమంగా దూరమవుతుందని మోత్కుపల్లి నరసింహులు అభిప్రాయపడ్డారు. రేవంత్ రెడ్డి కొందరినే చేరదీస్తూ పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ తన పరపతిని కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నారన్నారు.