రికార్డు బ్రేక్ చేసిన మునుగోడు

మునుగోడు ఉప ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది. గత రికార్డులను అధిగమించింది

Update: 2022-11-04 03:21 GMT

మునుగోడు ఉప ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది. గత రికార్డులను అధిగమించింది. ఈ ఉప ఎన్నికల్లో 93.13 శాతం ఓట్లు నమోదయ్యాయి. మునుగోడు ఉప ఎన్నికల్లో 2,41,805 ఓట్లు ఉంటే 2,51,923 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 686 పోస్టల్ బ్యాలట్లు దీనికి మినహాయించవచ్చు.

ఉదయం నుంచే...
మునుగోడులో ఉదయం నుంచి భారీగా నమోదయిన పోలింగ్ మధ్యాహ్నానికి మందకొడిగా సాగింది. అయితే సాయంత్రానికి మళ్లీ పంజుకుంది. పోలింగ్ ముగిసే 6 గంటల సమయానికి అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఉండటంతో వారందరికీ అవకాశం కల్పించారు. దీంతో భారీగా పోలింగ్ నమోదయిందని ఎన్నికల అధికారులు తెలిపారు.


Tags:    

Similar News