రంజాన్ మాసం ప్రారంభం

నెలవంక కనిపించడంతో రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభమయినట్లు ముస్లిం పెద్దలు ప్రకటించారు.

Update: 2022-04-03 03:46 GMT

రెండు తెలుగు రాష్ట్రాల్లో రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి. నెలవంక కనిపించడంతో రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభమయినట్లు ముస్లిం పెద్దలు ప్రకటించారు. రంజాన్ మాసం ప్రారంభమయిన నేపథ్యంలో ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ లు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసాన్ని ముస్లింలు పరమ పవిత్రమైన రోజులుగా భావిస్తారు. నెలరోజుల పాటు నియమ నిష్టలతో ఉపవాస దీక్షలు చేస్తారు.

ఉద్యోగులకు మినహాయింపు....
వేకువ జామునే ఆహారం తీసుకుని సాయంత్రం ఇఫ్తార్ తో ఉపవాస దీక్షను ముగిస్తారు. రంజాన్ మాసం ప్రారంభం కావడంతో మసీదులను సుందరంగా అలంకరించారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ముస్లిం ఉద్యోగులకు సాయంత్రం గంట ముందే విధుల నుంచి వెళ్లే అవకాశాన్ని కల్పించాయి. సాయంత్రం నాలుగు గంటలకే కార్యాలయాల నుంచి ముస్లిం ఉద్యోగులు వెళ్లి ప్రార్థనలు చేసుకునే వీలు కల్పించారు.


Tags:    

Similar News