ఈరోజు మొహర్రం .. ట్రాఫిక్ ఆంక్షలు

ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ముస్లిం సోదరులు మొహర్రంను జరుపుకుంటున్నారు.;

Update: 2022-08-09 05:03 GMT

ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ముస్లిం సోదరులు మొహర్రంను జరుపుకుంటున్నారు. త్యాగానికి, ధర్మ పరిరక్షణకు మొహర్రంను ప్రతీకగా భావిస్తారు. మహ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ బలిదానానికి గుర్తుగా మొహర్రంను ముస్లిం సోదరులు జరుపుకుంటారు. ఇస్లామిక్ క్యాలండర్ లో మొదటి నెల కూడా మొహర్రం కావడం విశేషం. పవిత్ర సంతాప దినాలుగా ముస్లిం సోదరులు దీనిని భావిస్తారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మొహర్రం సందర్భంగా సందేశాలను విడుదల చేశారు.

ట్రాఫిక్ ఆంక్షలు....
కాగా హైదరాబాద్ నగరంలో మొహర్రం జరుగుతున్న సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈరోజు బీబీకా ఆలం, డబీర్ పురా నుంచి మజిద్ ఎ ఇలాహీ, చాదర్ ఘాట్, వయా మీరాలం నుంచి శివాజీ వంతెన, దారుల్ సిఫా, గుల్జార్ హౌస్ , యాకుత్ పురా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మార్గాల గుండా వాహనాలను అనుమతించరు.


Tags:    

Similar News