Telangana : నేటి నుంచి నాగోబా జాతర.. పెద్ద సంఖ్యలో ఆదివాసీలు

ఆదివాసీలు నిర్వహించుకునే అతిపెద్ద పండగ నాగోబా జాతర. నేటి నుంచి ప్రారంభం కానుంది

Update: 2024-02-09 03:49 GMT

ఆదివాసీలు నిర్వహించుకునే అతిపెద్ద పండగ నాగోబా జాతర. నేటి నుంచి ప్రారంభం కానుంది. మొత్తం మూడు రోజుల పాటు నాగోబా జాతర జరగనుంది. ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లో ఈ జాతర ప్రారంభం కానుంది. గిరిజనులు మేడారం తర్వాత నాగోబా జాతరను అతి ముఖ్యమైనదిగా భావిస్తారు. ఈ జాతరను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. నేటి అర్థరాత్రి నుంచి జాతర ప్రారంభం కానుంది.

మూడు రోజుల పాటు...
11వ తేదీ వరకూ ఈ జాతర జరగనుండటంతో పోలీసులు కూడా భారీ భద్రతను ఏరపాటు చేశారు. కేస్లాపూర్ లోని మర్రిచెట్టు వద్ద హసతిన సరస్సుకు ఎనభై కిలో మీటర్ల దూరంలో ఉన్న నీటిని మెస్రం ప్రజలు తీసుకు వచ్చి పూజలు నిర్వహిస్తారు. నిన్న అర్థరాత్రి పెద్దలకు పూజలు నిర్వహించారు. ఈరోజు అర్థరాత్రి నాగోబాకు గంగాజలంతో అభిషేకం చేసిన తర్వాత జాతర ప్రారంభం కానుంది.


Tags:    

Similar News