తెలంగాణ సర్కార్ కు భారీ జరిమానా
తెలంగాణ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ భారీ జరిమానాను విధించింది.
తెలంగాణ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ భారీ జరిమానాను విధించింది. 920 కోట్ల జరిమానాను విధిస్తూ చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణ అనుమతులు లేకుండా ఎత్తిపోతల ప్రాజెక్టులు నిర్మించారన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విచారణ జరిపిన ఎన్జీటీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
అనుమతులు లేకుండా...
పాలమూరు - రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల పథకాలను పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మించారని ఎన్జీటీ ఈ జరిమానాను విధించింది. అనుమతులు తీసుకోకుండా ఎలా వాటిని నిర్మించారని ప్రశ్నించింది. ఈ జరిమానాను కేఆర్ఎంబీ వద్ద జమ చేయాలని కూడా ఎన్జీటీ ఆదేశించింది. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకుె సంబంధించి కేంద్ర ప్రభుత్వ అధికారులతో కమిటీని ఎన్జీటీ నియమించింది.