ఆ ప్రాజెక్టు తక్షణం నిలిపేయండి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్మిస్తున్న సీతారామ సాగర్ ప్రాజెక్టును తక్షణం నిలిపేయాలని జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశించింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్మిస్తున్న సీతారామ సాగర్ ప్రాజెక్టును తక్షణం నిలిపేయాలని జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశించింది. ఈ మేరకు చెన్నైలోని ఎన్‌జీటీ ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని, పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సిందేనని ఎన్‌జీటీ పేర్కొంది.
ఎన్‌జీటీ తీర్పుతో...
చెన్నై బెంచ్ తీర్పుతో సీతారామ ప్రాజెక్టు నిర్మాణ పనులు నిలిచిపోనున్నాయి. గోదావరి నీటి నిల్వతో పాటు జలవిద్యుత్ ఉత్పత్తికి ఉపయోగపడేలా దుమ్ముగూడెం ఆనకట్టకు ఎగువన ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. అయితే పర్యావరణ అనుమతులు లేవని ఎన్‌జీటీ ప్రాజెక్టు పనులను నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.