యువతిని వివస్త్రను చేసిన ఘ‌ట‌న‌పై జాతీయ మహిళా కమిషన్ సీరియస్

జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నడిచి వెళ్తున్న యువతి బట్టలు చింపి వివస్త్రను చేసిన‌ కేసులో

Update: 2023-08-09 06:52 GMT

ప్ర‌తీకాత్మ‌క చిత్రం


జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నడిచి వెళ్తున్న యువతి బట్టలు చింపి వివస్త్రను చేసిన‌ కేసులో నిందితుడు మారయ్యను అరెస్టు చేసి పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో నిందితుడికి సహకరించిన తల్లిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.

ఈ ఘ‌ట‌న‌పై జాతీయ మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఈ నెల 6న జరిగిన ఈ ఘటనను జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా ఖండించింది. ఈ కేసుపై పూర్తిస్థాయి విచార‌ణ జ‌రిపి వారంలోగా నివేదిక నివ్వాలని డీజీపీని కోరింది. యువతికి న్యాయం చేయాలని ఆదేశించింది.

ఏం జ‌రిగిందంటే..

జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ నగర్ బస్టాప్ రూట్‌లో నడుచుకుంటూ వెళ్తున్న యువతిపై పెద్ద మారయ్య అనే కూలి పీకలదాకా మద్యం సేవించి దాడి చేశాడు. యువతి బట్టలు చింపి వివస్త్రను చేసి 15 నిమిషాల పాటు రోడ్డు మీద నగ్నంగా ఉంచాడు. స్థానికులు అడ్డుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే మారయ్య యువతిపై దాడి చేస్తూ.. బట్టలు చింపుతుంటె అతని తల్లి నాగమ్మ ఆప‌కుండా నిందితుడికి సహకరించింది. దీంతో జవహర్ నగర్ పోలీసులు నిందితుడి తల్లి నాగమ్మను కూడా అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.


Tags:    

Similar News