మరో ఐటీ హబ్.. ఆ ప్రాంతం దశ మారనుందా?

నిజామాబాద్‌లో నూతన ఐటీ హబ్‌ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు బుధవారం

Update: 2023-08-08 09:19 GMT

నిజామాబాద్‌లో నూతన ఐటీ హబ్‌ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు బుధవారం ప్రారంభించనున్నారు. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TSIIC) నిర్మించిన ఈ IT హబ్, 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. 750 ప్లగ్ అండ్ ప్లే సీటింగ్ కెపాసిటీని కలిగి ఉంది. ఇది అత్యాధునిక సాంకేతికతతో కూడిన అత్యాధునిక సదుపాయం.. ఆధునిక వ్యాపారాల అవసరాలను తీర్చడానికి అన్ని సౌకర్యాలు ఇందులో ఉన్నాయి.

రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాలకు ఐటీ పరిశ్రమను విస్తరించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమానికి నాంది పలికింది. ఇప్పటికే కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, సిద్దిపేటలో ఐటీ హబ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రభుత్వం తాజాగా నిజామాబాద్‌ లో ఐటీ టవర్‌ (IT Tower) ప్రారంభానికి సిద్ధమైంది. ఇందూరు ఐటీ టవర్‌ను మంత్రి కేటీఆర్‌ బుధవారం ప్రారంభించనున్నారు. టైర్‌ 2 పట్టణాలు, నగరాలకు ఐటీ సెక్టార్‌లో విస్తరించడంలో భాగంగా నిజామాబాద్‌లో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఐటీ హబ్‌ను ప్రారంభిస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు కేటీఆర్. యువత తమ నైపుణ్యాలు పెంచుకోవడానికి, సరికొత్త ఆవిష్కరణల కోసం ఇందులో టీ-హబ్‌, టాస్క్‌ సెంటర్లను కూడా ఉన్నాయన్నారు. దీనిద్వారా తెలంగాణ అభివృద్ధిలో యువత పాలుపంచుకునే అవకాశం లభిస్తుందని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీలు ఇప్పటికే నిజామాబాద్‌పై ఆసక్తి చూపుతున్నాయని అధికారులు తెలిపారు. ఐటి హబ్‌ను మరింత ప్రోత్సహించడానికి, మరిన్ని కంపెనీలను ఆకర్షించడానికి తెలంగాణ ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలను అందిస్తోంది. ఇక్కడ కంపెనీలు నిర్వహణ ఖర్చులు మాత్రమే చెల్లించాలి. రెండవ సంవత్సరం నుండి అద్దె ఖర్చులు ఉంటాయి.


Tags:    

Similar News