మునుగోడులో నేటి నుంచి నామినేషన్లు
నేటి నుంచి మునుగోడు ఉప ఎన్నికల నామినేషన్లు స్వీకరిస్తారు. ఈరోజు మునుగోడు ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది
నేటి నుంచి మునుగోడు ఉప ఎన్నికల నామినేషన్లు స్వీకరిస్తారు. ఈరోజు మునుగోడు ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. నవంబరు 3వ తేదీన మునుగోడు ఉప ఎన్నిక జరగనుండగా, ఆరోతేదీన కౌంటింగ్ జరుగుతుందని కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్ లో పేర్కొంది.
నేడు నోటిఫికేషన్...
మునుగోడులో అభ్యర్థులు వరసగా నామినేషన్లు ఈరోజు నుంచి వేసేందుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి ఖరారయ్యారు. బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు దాదాపు ఖరారయినట్లే. ఇక టీఆర్ఎస్ ఈరోజు, రేపో అభ్యర్థిని ప్రకటించే అవకాశాలున్నాయి. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించే ఛాన్స్ ఉంది. ప్రజాశాంతి పార్టీ తరుపున ప్రజాగాయకుడు గద్దర్ పోటీ చేస్తున్నారు. వీరంతా నేటి నుంచి నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు.