తెలంగాణలో జనవరి చివరలో లాక్ డౌన్?

తెలంగాణలో కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి.

Update: 2022-01-03 13:05 GMT

తెలంగాణలో కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ కేసుల సంఖ్య ప్రస్తుతం 84కు చేరుకుంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే బహిరంగ సమావేశాలపై నిషేధం విధించారు. జనవరి పదో తేదీ వరకూ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి.

పెరుగుతున్న కేసులు....
ఇక తాజాగా తెలంగాణలో 274 కరోనా కేసులు నమోదయ్యాయి. 3,779 యాక్టివ్ కేసులున్నాయి. కేసుల సంఖ్య మరింత పెరిగితే లాక్ డౌన్ విషయం ఆలోచిస్తామన్నారు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు. లాక్ డౌన్ బహుశ జనవరి చివరి నెల నుంచి ఉండే అవకాశముంటుందని చెబుతున్నారు. కేసుల సంఖ్య, తీవ్రతను బట్టి నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు.


Tags:    

Similar News