భక్తి శ్రద్దలతో వరలక్ష్మీ వ్రతం కొండెక్కిన పూల ధరలు

దక్షిణాది రాష్ట్రాల ప్రజలు వరలక్ష్మీ వ్రతాన్ని భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. ప్రతి ఏడాది శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ.

Update: 2023-08-24 13:41 GMT

భక్తి శ్రద్దలతో వరలక్ష్మీ వ్రతం

కొండెక్కిన పూల ధరలు

దక్షిణాది రాష్ట్రాల ప్రజలు వరలక్ష్మీ వ్రతాన్ని భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. ప్రతి ఏడాది శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ. మహిళలు పరస్పరం వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. వరలక్ష్మీవ్రతం సందర్భంగా విజయవాడలోని కనకదుర్గమ్మకు ప్రత్యేక పూజలు జరుపుతారు. ఆయా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి. శ్రావణమాసం అందులో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని సంప్రదాయం ప్రకారం ఆచరిస్తే సౌభాగ్యంతో పాటు సుఖ, సంతోషాలు కలుగుతాయని మహిళలు భావిస్తుంటారు.



కొత్తగా పెళ్లయిన దంపతులు తమకు తోచిన విధంగా భక్తిశ్రద్ధలతో వరలక్ష్మి దేవి వ్రతం చేసుకున్నట్లయితే సకల భోభాగ్యాలు కూడా కలిగి సుఖశాంతులతో దీర్ఘ సుమంగళీభవ గా వుంటారని వేదపండితులు చెబుతారు. ఒకవేళ పౌర్ణమి ముందు వచ్చే రెండవ శుక్రవారం పూజ చేసుకోవడానికి అవకాశం లేకపోతే మూడవ శుక్రవారం అయినా సరే తప్పకుండా పూజ చేయాలని అంటున్నారు. ఉగాది తర్వాత మొదటి పండుగ ఇదేనని ఆషాడ మాసానికి వెళ్లి వచ్చిన పెళ్లి కూతురులు అందరూ కూడా అత్తవారింట్లో ఈ పూజ చేయాలని పండితులు చెబుతున్నారు.

శ్రావణ మాసంలో కాయగూరల ధరలే కాకుండా వరలక్ష్మి వ్రతం కారణంగా పూల ధరలు కూడా భారీగా పెరిగాయి. ప్రస్తుతం మల్లె పూలు కేజీ రూ.300, బంతిపూలు రూ.60, గులాబీ రూ. 300, ఆర్కిడ్ పూలు రూ.170, చామంతులు రూ.120, లిల్లీ కేజీ రూ.150 గా ఉంది.

Tags:    

Similar News