కేటీపీఎస్ లో కాలం చెల్లిన ప్లాంట్లు కూల్చివేత
కేటీపీఎస్ పాత ప్లాంట్ లో ఎనిమిది కూలింగ్ టవర్లను అధికారులు కూల్చివేశారు.
కేటీపీఎస్ పాత ప్లాంట్ లో ఎనిమిది కూలింగ్ టవర్లను అధికారులు కూల్చివేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని కేటీపీఎస్ ఫ్యాక్టరీలో ఉన్న 102 మీటర్ల ఎత్తులో ఉన్న ఎనిమిది కూలింగ్ టవర్లను కూల్చివేశారు. ఇంప్లోజన్ టెక్నాలజీ ద్వారా జెన్కో అధికారుల పర్యవేక్షణలో ఈ కూల్చివేతలు జరిగాయి.
టెక్నాలజీ ద్వారా...
ఈ యూనిట్లకు కాలం చెల్లిపోవడంతో సెంట్రల్ అథారిటీ ఆదేశాల మేరకు కూల్చి వేత ప్రక్రియకు రెండు సంవత్సరాలు కొనసాగింది. అయితే ఎట్టకేలకు కూలింగ్ టవర్లను కూల్చి వేశారు. ఈ సందర్భంగా అనేక జాగ్రత్తలు అధికారులు తీసుకున్నారు. ఎనిమిది టవర్లు కూలిపోయే దృశ్యాలను చూసేందుకు పెద్దయెత్తున ప్రజలు తరలి వచ్చారు. దూరం నుంచి చూసి వీడియోల ద్వారా కూల్చివేత కార్యక్రమాన్ని చిత్రీకరించారు.