గుట్టలో పీటల వివాదానికి తెర
యాదగిరిగుట్ట ఆలయంలో పీటల వివాదం పై అధికారుల అప్రమత్తమయ్యారు.
యాదగిరిగుట్ట ఆలయంలో పీటల వివాదం పై అధికారుల అప్రమత్తమయ్యారు. ఇటీవల ఆలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మహిళా మంత్రి కొండా సురేఖకు చిన్న పీటలు వేసి అవమానించారని సోషల్ మీడియాలో విపక్ష పార్టీలు ట్రోల్ చేశాయి. ఇది వివాదాస్పదంగా మారడంతో ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
కొత్త పీటలను కొనుగోలు చేసి...
పీటల వివాదాానికి తెర దించాలని నిర్ణయించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా యాదగిరిగుట్ట దేవస్థాన అధికారులు పది సమాంతర పీటలు కొనుగోలు చేశారు. ప్రత్యేక పూజల అనంతరం పది పీటలను వాడుకలో తేనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. పాతవి నాలుగు కాగా, కొత్తపీటలు పదితో సహా ఒకేసారి పథ్నాలుగు మంది వీవీఐపీలకు వేద ఆశీర్వచనం చేసేలా చర్యలు చేపట్టారు.