Telangana : నేటి నుంచి పంటనష్టం అంచనా
తెలంగాణలో నేటి నుంచి పంట నష్టం అంచనాలను అధికారులు వేయనున్నారు.
తెలంగాణలో నేటి నుంచి పంట నష్టం అంచనాలను అధికారులు వేయనున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు అనేక చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. చేతికొచ్చిన పంటలు అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్నాయి. గత మూడు రోజులుగా కురిసిన వడగండ్ల వానతో అనేక ప్రాంతాల్లో పంటలు దెబ్బతినడంతో రాష్ట్ర ప్రభుత్వం అంచనాలను రూపొందించాలని అధికారులను ఆదేశించింది.
అకాల వర్షాలకు....
జొన్న, మొక్క జొన్న, మామిడి, మిర్చి వంటి పంటలు బాగా దెబ్బతిన్నాయి. అన్ని జిల్లాల్లో ఈ పంటలు అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం నష్టం అంచనాలను వెంటనే రూపొందించాలని ఆదేశించడంతో నేటి నుంచి నష్టం అంచనాలను సేకరించేందుకు అధికారులు బయలుదేరి వెళ్లారు.