తెలంగాణలో పెరిగిన ఒమిక్రాన్ కేసులు
తెలంగాణను ఒమిక్రాన్ వేరియంట్ కలవరపెడుతుంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుంది.;
తెలంగాణను ఒమిక్రాన్ వేరియంట్ కలవరపెడుతుంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుంది. తాజాగా ఐదు ఒమిక్రాన్ కేసులు తెలంగాణలో నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 84కు చేరుకుంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఒమిక్రాన్ బాధితులు త్వరగానే కోలుకుంటున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకూ 32 మంది ఒమిక్రాన్ సోకిన వారు కోలుకున్నట్లు తెలిపింది.
కరోనా కేసులు.....
మరోవైపు కరోనా కేసులు కూడా తెలంగాణలో పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. దీంతో ప్రభుత్వం ఆంక్షలను కొనసాగించాలని నిర్ణయించింది. ఈ నెల 10వ తేదీ వరకూ తెలంగాణలో ఆంక్షలను కొనసాగించేలా ఉత్తర్వులు జారీ అయ్యాయి. సంక్రాంతి పండగ తర్వాత కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందన్న అంచనాలు విన్పిస్తున్నాయి.