లాక్ డౌన్ లేదు కాని... కేసులు మాత్రం?

తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు ఎక్కువవుతున్నాయి. అదే సమయంలో కరోనా కేసులు కూడా రోజురోజుకూ పెరుగుతున్నాయి.;

Update: 2022-01-04 02:37 GMT

తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు ఎక్కువవుతున్నాయి. అదే సమయంలో కరోనా కేసులు కూడా రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అప్రమత్తమయ్యారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో చర్చించారు. కరోనా కేసులు పెరుగుతుండటంపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తుందని, తొలిదశలోనే కట్టడి చేయాలని కేసీఆర్ కు నివేదిక ఇచ్చారు. అయితే లాక్ డౌన్ విధించాల్సిన అవసరం లేదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.

సెలవులు...
అయితే ఈ నెల 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకూ రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు కేసీఆర్ సెలవులు ప్రకటించారు. ప్రజలు స్వచ్ఛందంగా కోవిడ్ నిబంధనలను పాటించాలని సూచించారు. ఆసుపత్రుల్లో అవసరమైన పడకలు, ఆక్సిజన్ ను కూడా సిద్ధం చేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ కేసీఆర్ కు వెల్లడించింది. సామూహిక సమావేశాలకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వవద్దని ఆదేశించారు. ఈ నెల 10వ తేదీ తర్వాత ఆంక్షలను మరింత కఠినతరం చేయనున్నారు.


Tags:    

Similar News