తెలంగాణలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు.. ఈ ఒక్కరోజే
తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈరోజు కొత్తగా ఏడు కేసులు నమోదయ్యాయి.;
తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈరోజు కొత్తగా ఏడు కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం 62 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. ఇప్పటికే దీనిని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. కొన్ని ఆంక్షలను విధించింది. అయినా ఒమిక్రాన్ కేసులు మాత్రం రోజురోజుకూ పెరుగుతూ వస్తున్నాయి.
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్....
అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు అనుమతి ఇచ్చింది. వైన్ షాపులకు డిసెంబరు 31 అర్ధరాత్రి 12 గంటల వరకూ, పబ్ లు, ఇతర ఈవెంట్లకు ఒంటి గంట వరకూ అనుమతి ఇచ్చింది. దీంతో కరోనా కేసులు మళ్లీ పెరుగుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఒమిక్రాన్ కేసులు రోజూ పెరుగుతుండటంతో త్వరలో నైట్ కర్ఫ్యూ విధించాలన్న ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం ఉంది.