తెలంగాణలో పెరుగుతున్న ఒమిక్రాన్

తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. కొత్గా 12 కేసులు తెలంగాణలో నమోదయినట్లు వైద్యశాఖ అధికారులు వెల్లడించారు;

Update: 2021-12-28 02:21 GMT

తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కొత్గా 12 కేసులు తెలంగాణలో నమోదయినట్లు వైద్యశాఖ అధికారులు వెల్లడించారు. దీంతో ప్రస్తుతం తెలంగాణలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 56 కు చేరుకుంది. విదేశాల నుంచి వచ్చే వారికి క్షుణ్ణంగా పరీక్షలు నిర్వహిస్తూ కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారికి ఐసొలేషన్ కు పంపుతున్నారు. అయినా ఒమిక్రాన్ కేసులు మాత్రం తెలంగాణలో ఆగడం లేదు.

నైట్ కర్ఫ్యూ దిశగా....
56 ఒమిక్రాన్ కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆంక్షలను మరింత పెంచే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇప్పటికే నూతన సంవత్సర వేడుకలపై నిషేధం విధించింది. నైట్ కర్ఫ్యూ పై కూడా తెలంగాణ ప్రభుత్వం ఈరోజు, రేపట్లో నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.


Tags:    

Similar News