తెలంగాణలో 12 ఒమిక్రాన్ కేసులు

తెలంగాణాలో ఒమిక్రాన్ టెన్షన్ వదలడం లేదు. తాజాగా 12 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.;

Update: 2022-01-01 15:04 GMT

తెలంగాణాలో ఒమిక్రాన్ టెన్షన్ వదలడం లేదు. తాజాగా 12 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు 79 కు చేరుకున్నాయి. 79 మందిలో 27 మంది ఒమిక్రాన్ వేరియంట్ నుంచి కోలుకున్నారు. ప్రభుత్వం ఆంక్షలు విధించినా కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది.

పెరుగుతున్న కరోనా కేసులు
ఇక ఈరోజు తెలంగాణలో 372 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇద్దరు కరోనా కారణంగా మరణించారు. తెలంగాణలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు కూడా పెరిగాయి. 3,733 యాక్టివ్ కేసులు ప్రస్తుతం ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.



Tags:    

Similar News