23 అంశాలపై ఫోకస్... పార్లమెంటులో టీఆర్ఎస్ టార్గెట్
కేసీఆర్ అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం తెలంగాణ భవన్ లో దాదాపు మూడు గంటలకు పైగానే సాగింది.
టీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశం ముగిసింది. కేసీఆర్ అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం తెలంగాణ భవన్ లో దాదాపు మూడు గంటలకు పైగానే సాగింది. ఈ సమావేశంలో పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాన్ని రూపొందించారు. ఏ ఏ అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలన్న దానిపై లోక్ సభ, రాజ్యసభ సభ్యులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
విభజన అంశాలపై....
మొత్తం 23 అంశాలపై పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులతో పాటు విభజన అంశాలపై కూడా కేంద్రాన్ని నిలదీయాలని సమావేశం నిర్ణయించింది. ప్రతి రోజూ ప్రజా సమస్యలపై వాయిదా తీర్మానం ఇస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరించాలని కేసీఆర్ ఎంపీలకు సూచించినట్లు తెలిసింది. పార్లమెంటరీ సమావేశం ముగిసిన తర్వాత ఎంపీ రంజిత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ 23 అంశాలపై తాము కేంద్రాన్ని నిలదీస్తామని చెప్పారు.