Breaking : కేటీఆర్‌కు షాకిచ్చిన సొంత నియోజకవర్గ నేతలు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఆ పార్టీ నేతలు భారీ షాకిచ్చారు. సిరిసిల్ల కౌన్సిలర్లు 16 మంది జంప్ అయ్యారు.

Update: 2024-01-28 06:58 GMT

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు ఆ పార్టీ నేతలు భారీ షాకిచ్చారు. సిరిసిల్ల కౌన్సిలర్లు 16 మంది జంప్ అయ్యారు. వారు కాంగ్రెస్ గూటికి చేరుకోనున్నట్లు తెలిసింది. వారు ఇప్పటికే కాంగ్రెస్ క్యాంప్‌నకు బయలుదేరి వెళ్లినట్లు తెలిసింది. సిరిసిల్ల మున్సిపల్ ఛైర్మన్ పై అవిశ్వాసానికి మద్దతుగా బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ కు మద్దతిచ్చేందుకు రెడీ అయ్యారు.

కాంగ్రెస్ కు అనుకూలంగా...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల మున్సిపాలిటీని చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మున్సిపల్ ఛైర్మన్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గితే ఆ మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ పరమవుతుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఇది కేటీఆర్ కు పెద్ద దెబ్బ అని చెప్పాలి.


Tags:    

Similar News