అలాంటి వారికి రాహుల్ తో సన్మానం చేయిస్తాం
ప్రతి బూత్ నుంచి వంద మంది సభ్యత్వం నమోదు చేయాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు
ప్రతి బూత్ నుంచి వంద మంది సభ్యత్వం నమోదు చేయాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటి వరకూ ఏడు లక్షల సభ్యత్వాలు పూర్తయ్యాయని చెప్పారు. సభ్యత్వం నమోదు చేసుకున్న వారికి రెండు లక్షల ప్రమాద బీమా సౌకర్యం కలుగుతుందని చెప్పారు. ప్రమాదంలో శరీర అవయవాలు దెబ్బతింటే ప్రమాద తీవ్రతను బట్టి పరిహారం అందుతుందని చెప్పారు. ఈ మేరకు న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీతో రేవంత్ రెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నారు.
30 లక్షల సభ్యత్వం....
రాష్ట్రంలో 30 లక్షల మేర సభ్యత్వాన్ని నమోదు చేయాలని రేవంత్ రెడ్డి కోరారు. ఈ నెల 26వరకూ సభ్యత్వ నమోదుకు చివరి గడువు అనుకున్నప్పటికీ కరోనా కారణంగా మరికొంత సమయాన్ని పెంచుతున్నామని చెపపారు. ప్రతి మండలానికి పదివేలు, అసెంబ్లీ నియోజకవర్గం లో యాభైవేలు, పార్లమెంటు పరిధిలో మూడున్నర లక్షల సభ్యత్వాలను నమోదు చేయించాలని కోరారు. అలా చేస్తే రాహుల్ గాంధీతో సన్మానం చేయిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.