వైఎస్ షర్మిల అరెస్ట్
టీఎస్‌పీఎస్సీ కార్యాలయం వద్ద వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు
టీఎస్‌పీఎస్సీ కార్యాలయం వద్ద వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రశ్నాపత్రాలు లీకేజీ ఘటనలో అసలు నిందితులను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. తనకు లుక్ అవుట్ నోటీసులు ఇచ్చారని, ఎందుకు ఇచ్చారని ఆమె ప్రశ్నించారు. ప్రస్తుతం అరెస్ట్ చేసిన వారంతా చిన్నవారేనని, వారి అరెస్ట్‌తో కేసును క్లోజ్ చేయాలని ఈ ప్రభుత్వం చూస్తుందని వైఎస్ షర్మిల ఆరోపించారు.
అసలు నిందితులను...
తనను అరెస్ట్ చేయడం ఎందుకని ఆమె ప్రశ్నించారు. తాను ఏమైనా క్రిమినల్‌నా అని నిలదీశారు. కేసీఆర్ నియంతలాగా వ్యవహరిస్తున్నారన్నారు. అవినీతికి పాల్పడుతున్న కేసీఆర్ కుటుంబాన్ని తరిమికొట్టాలని ఆమె పిలుపునిచ్చారు. టీఎస్‌పీఎస్సీలో ప్రశ్నాపత్రాల లీకేజీ అంశాన్ని సీబీఐ చేత విచారణ జరిపితేనే న్యాయం జరుగుతుందని వైఎస్ షర్మిల అభిప్రాయపడ్డారు. లేదంటే అమాయకులు జైల్లోనూ, అసలు నిందితులు బయట ఉంటారని ఆమె అన్నారు.