ఆపరేషన్ సక్సెస్.. ఏడు కోట్ల ఆస్తి నష్టం
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పోలీసులు క్లియర్ చేశారు. ఆర్మీ అభ్యర్థులను అదుపులోకి తీసుకున్నారు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పోలీసులు క్లియర్ చేశారు. ఆర్మీ అభ్యర్థులను అదుపులోకి తీసుకుని సమీప పోలీస్ స్టేషన్ లోకి తీసుకెళ్లారు. ఉదయం 8గంటల నుంచి ప్రారంభమైన వివాదానికి సాయంత్రం ఆరుగంటలకు ఫుల్ స్టాప్ పాడింది. ఆర్పీఎఫ్, సిటీ పోలీసులు కలసి జాయింట్ ఆపరేషన్ తో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఆర్మీ అభ్యర్థులను బయటకు తరలించారు. ప్రస్తుతం పోలీసుల స్వాధీనంలో సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్ ఉంది.
గంటలో రైళ్లు పునరుద్ధరణ...
మరో గంటలో సికింద్రాబాద్ నుంచి రైళ్లు బయలుదేరతాయని డీఆర్ఎం గుప్తా చెబుతున్నారు. ఏడు కోట్ల మేర రైల్వే ఆస్తి నష్టం జరిగిందని చెప్పారు. సిగ్నలింగ్ వ్యవస్థకు నష్టం జరగలేదని, ఎక్కువగా రైల్వే ప్లాట్‌ఫారాలపై ఉన్న దుకాణాలు ధ్వంసమయ్యాయని చెపపారు. పార్శిల్ ఆఫీసులో ఉన్న వస్తువలన్నీ ధ్వంసమయ్యాయని చెప్పారు. సిగ్నలింగ్ వ్యవస్థను సరిచూసుకుని రైళ్లను పునరుద్ధరిస్తామని ఆయన చెప్పారు.