ప్రీతిని సైఫ్ వేధించాడు.. పోలీసుల నిర్ధారణ
నెలలుగా పీజీ స్టూడెంట్ ప్రీతిని సైఫ్ వేధిస్తున్నాడని పోలీసులు తేల్చారు. సైఫ్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు
నాలుగు నెలలుగా కేఎంసీ పీజీ స్టూడెంట్ ప్రీతిని సైఫ్ వేధిస్తున్నాడని పోలీసులు తేల్చారు. సైఫ్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ర్యాగింగ్ కేసు కూడా నమోదు చేశామని వరంగల్ పోలీసు కమిషనర్ రంగనాధ్ తెలిపారు. వాట్సాప్ గ్రూప్ లలో మెసేజ్ పెడుతూ ప్రీతిని అవమానపర్చే విధంగా మెసేజ్ పెట్టేవారన్నారు. వాట్సాప్ గ్రూపులలో మెసేజ్ పెట్టవద్దని వేడుకున్నా వినలేదని చెప్పారు. అయినా సైఫ్ వినకుండా మెసేజ్ లు పెడుతూనే ఉన్నారు. ప్రీతిని టార్గెట్ చేసినట్లు మెసేజ్ లు పెడుతుండటంతో ప్రీతి తన తండ్రి నరేంద్రకు ఈ విషయం తెలిపిందన్నారు.
గూగుల్ లో సెర్చ్ చేసి...
అయితే నరేంద్ర ఏఎస్ఐకి ఫోన్ చేసినా ఆయన సమావేశంలో ఉండటంతో ఫోన్ లిఫ్ట్ చేయలేదన్నారు. మెసేజ్ కూడా రిప్లై ఇవ్వలేదన్నారు. సైఫ్ వేధించినట్లుగా ఆధారాలు లభించాయని తెలిపారు. 21న సైఫ్‌ను, ప్రీతిని పిలిచి కళాశాల యాజమాన్యం కౌన్సిలంగ్ జరిపింది. తండ్రి వచ్చి ప్రీతికి ధైర్యం చెప్పినా సైఫ్ వేధింపులు ఆపకపోవడంతో ప్రీతి ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. ముఖ్యంగా గ్రూపుల్లో అవమానపర్చేలా సైఫ్ మెసేజ్ పెడుతుండటంతో ప్రీతి ఇబ్బంది పడింది. ప్రీతి తాను అవమానానికి గురి చేస్తున్నాడని, ఇక ఆపడని భావించి ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. గూగుల్ లో సెర్చ్ చేసి ఇంజక్షన్ చేసుకుందన్నారు.
రాజకీయాలకు సంబంధం లేదు...
20వ తేదీన తనపై జరుగుతున్న వేధింపుల గురించి తండ్రికి చెప్పిన వెంటనే ఆయన పోలీసులను సంప్రదించారు. ఎస్‌ఐ కూడా వెంటనే కళాశాల ప్రిన్సిపల్ దృష్టికి ఈ విషయం తీసుకెళ్లారన్నారు. సైఫ్ వేధింపులకు తాళలేకనే ఆమె ఎదురు ప్రశ్నించిడం సహించలేని సైఫ్ మరింత వేధింపులకు పాల్పడ్డాడు. సైఫ్ కు రాజకీయాలకు ఎలాంటి సంబంధాలు లేవన్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలపై నమ్మవద్దని వరంగల్ పోలీసు కమిషనర్ రంగనాధ్ తెలిపారు. ఇంకా కేసు విచారణ దశలోనే ఉందని, మరికొందరిని విచారించాల్సి ఉందని ఆయన తెలిపారు.