శుక్రవారం.. పాతబస్తీలో భారీ బందోబస్తు
హైదరాబాద్ లోని పాతబస్తీలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ఈరోజు శుక్రవారం కావడంతో ప్రార్థనలు జరగనుండటంతో అప్రమత్తమయ్యారు.
హైదరాబాద్ లోని పాతబస్తీలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఈరోజు శుక్రవారం కావడంతో ప్రార్థనలు జరగనుండటంతో అప్రమత్తమయ్యారు. ఈరోజు కూడా నిరసనలు కొనసాగే అవకాశముందని భావించి సమస్యాత్మక ప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను దించారు. మరోవైపు హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు కూడా మొహరించారు. మక్కా మసీదులో శుక్రవారం మధ్యాహ్నం జుమ్మా, ప్రత్యేక ప్రార్థనల నేపథ్యంలో పోలీసులు నిఘాను మరింత పెంచారు. శాలిబండ, ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్ట ప్రాంతాల్లో పోలీసులు వచ్చి పోయే వాహనాలను పరిశీలిస్తున్నారు.
ఒవైసీ పిలుపు...
మరోవైపు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పాతబస్తీ ప్రజలకు పిలుపు నిచ్చారు. ప్రశాంత వాతావరణంలో శుక్రవారం ప్రార్థనలను జరుపుకోవాలని సూచించారు. శుక్రవారం జుమ్మా ప్రత్యేక ప్రార్థనలను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. ెలాంటి విధ్వేషపూరితమైన చర్యలకు పాల్పడవద్దని, శాంతిభద్రతలకు భంగం కల్గించ వద్దని ఒవైసీ విజ్ఞప్తి చేశారు. పాతబస్తీలో మాత్రం పోలీసులు విస్తృత బందోబస్తును ఏర్పాటు చేశారు.