చావడానికైనా సిద్ధమే
భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేశారు.
భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ముంబయిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఒక వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడారంటూ ఆయనపై కేసు నమోదు చేసినట్లు తెలిసింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 29న ముంబయిలోని దాదర్ లోజరిగిన ర్యాలీలో వివాదస్పద వ్యాఖ్యలు చేసినట్లు మంగళ్‌హాట్ పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. రెండు రోజుల్లోగా సమాధానమివ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
పోలీసులు నోటీసులపై...
అయితే దీనిపై రాజాసింగ్ స్పందించారు. రాష్ట్రాన్ని ఎనిమిదో నిజాం పాలిస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ పై మండి పడ్డారు. నిజాం పాలనకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని, పోలీసులు నోటీసులు ఇచ్చి జైలుకు పంపినా తాను భయపడబోనని చెప్పారు. ధర్మం కోసం చావడానికైనా సిద్ధమని ఆయన ప్రకటించారు. గో హత్య, మతమార్పిడులు, లవ్ జిహాద్ పై చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశానని, ఇందులో మతవిధ్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏమున్నాయని రాజాసింగ్ ప్రశ్నించారు.