Breaking: తెలంగాణలో మరో సంచలన సర్వే రిపోర్ట్.. ఆ పార్టీలకు షాక్
Telangana Election: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీల దూకుడు మరింతగా పెరిగింది. ఎవరికి వారు వ్యూహాలు
Telangana Election: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీల దూకుడు మరింతగా పెరిగింది. ఎవరికి వారు వ్యూహాలు రచిస్తూ తెలంగాణలో పాగ వేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. నువ్వా.. నేనా అన్నట్లు మాటల యుద్ధాలు, విమర్శలు, ప్రతి విమర్శలు, హామీలు ఇలా ఒక్కటేమిటి ఓటర్లను ఆకట్టుకునేందుకు వివిధ పార్టీలు రకరకాల ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. నామినేషన్ల పర్వం మొదలైన నేపథ్యంలో పార్టీల దూకుడు మరింతగా పెరిగిపోయింది.
గెలుపే లక్ష్యంగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. అయితే ఇటీవల నుంచి తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయంపై సర్వేలు నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల భవితవ్యం ఎలా ఉండబోతుందన్న విషయాలన్ని సర్వే రిపోర్టుల ద్వారా బట్టబయలు చేస్తున్నాయి. తాజాగా Political critic సర్వే నిర్వహించి సర్వే రిపోర్టును విడుదల చేసింది.
ఏ పార్టీకి ఎంత..?
బీఆర్‌ఎస్ - 61 - 66
ఐఎన్‌సీ - 46 - 51
బీజేపీ - 02- 05
ఎంఐఎం - 05- 07