మునుగోడు రికార్డులు ఇలా .. మరి ఇప్పుడు ఎలాగో?
మునుగోడు ఉప ఎన్నికల్లో ఎప్పుడూ పోలింగ్ శాతం ఎక్కువగానే నమోదవుతూ వస్తుంది
మునుగోడు ఉప ఎన్నికల్లో ఎప్పుడూ పోలింగ్ శాతం ఎక్కువగానే నమోదవుతూ వస్తుంది. ఈసారి కూడా అధికంగానే పోలింగ్ జరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఎప్పుడూ 80 శాతానికి తగ్గకుండా మునుగోడు నియోజకవర్గంలో పోలింగ్ శాతం నమోదయింది. ఈరోజు ఉదయాన్నే మునుగోడు పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు పోటెత్తారు. దీంతో ఈసారి కూడా 90 శాతం వరకూ పోలింగ్ నమోదయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
80 శాతానికి పైగానే...
2004లో 1,66,552 మంది ఓటర్లు ఉంటే 1,45,431 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 87.31 శాతం పోలింగ్ నమోదయింది. 2009 ఎన్నికల్లో మొత్తం 2,12,869 మంది ఓటర్లుంటే 1,64,231 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ శాతం 71.15 శాతం ఓట్లు నమోదయ్యాయి.
గత ఎన్నికల్లో...
2014 అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడులో 2,09,092 మంది ఓటర్లున్నారు. ఈ ఎన్నికల్లో 1,71,786 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ శాతం 82.15 శాతం నమోదయిందని రికార్డులు చెబుతున్నాయి. 2018 ఎన్నికల్లో 2,17,760 మంది ఓటర్లు ఉండగా 1,98,849 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఓటింగ్ శాతం 91.31 శాతంగా నమోదయింది. మరి ఇప్పుడు ఉప ఎన్నికలలో ఏ మేరకు ఓటర్లు పోటెత్తుతారన్నది ఆసక్తికరంగా మారింది.