Prajavani : ప్రజావాణికి పోటెత్తిన జనం
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత శుక్రవారం అని చెప్పినా తర్వాత జనం రద్దీ ఎక్కువగా ఉండటంతో మంగళవారం కూడా ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తామని చెప్పారు. దీంతో ప్రతి వారంలో రెండు రోజుల పాటు మంగళ, శుక్రవారాల్లో పూలే భవన్ లో ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకుంటారు. వారి సమస్యలను ఉన్నతాధికారులకు పంపి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారు.
క్యూ కట్టిన నేతలు...
అయితే ఈరోజు శుక్రవారం కావడంతో ఉదయం నుంచే ప్రగతి భవన్ వద్ద ప్రజలు క్యూ కట్టారు. ఉదయం ఏడు గంటల నుంచే ప్రజలు అక్కడకు చేరుకుని క్యూ లో నిలబెట్టారు. నేరుగా ముఖ్యమంత్రి, మంత్రులు వినతులు స్వీకరిస్తుండటంతో ప్రజలు కూడా తమ సమస్యలను చెప్పుకునేందుకు వస్తున్నారు. దీనికితోడు జిల్లా కేంద్రంలోనూ కలెక్టర్ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమమే పెట్టినా ఎక్కువ మంది రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి వస్తుండటం విశేషం. ఎక్కువగా భూ సమస్యలు, రేషన్ కార్డులు, డబుల్ బెడ్ రూం వంటి సమస్యలు ఉంటున్నాయని అధికారులు చెబుతున్నారు.