పరుగులు తీసిన వందేభారత్ రైలు

వందేభారత్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. వర్చువల్ గా ఆయన జెండా ఊపి ప్రారంభించారు

Update: 2023-01-15 05:55 GMT

వందేభారత్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. వర్చువల్ గా ఆయన జెండా ఊపి ప్రారంభించడంతో రైలు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి విశాఖపట్నానికి బయలుదేరి వెళ్లింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. రైల్వేశాఖ ప్రతి ఏటా ప్రయాణికుల సౌకర్యం కోసం మూడు వేల కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. మారుతున్న దేశ భవిష్యత్ కు వందేభారత్ రైలు ఇది ఒక ఉదాహరణ మాత్రమేనని ఆయన తెలిపారు.

సంక్రాంతి కానుక : ప్రధాని
తెలుగు ప్రజలందరికీ వందేభారత్ రైలు సంక్రాంతి కానుక అని అన్నారు. వందేభారత్ రైలును వేగంగా ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చుతుందన్నారు. సికింద్రాబాద్ - విశాఖల మధ్య ప్రయాణ సమయం తగ్గుతుందని ప్రధాని తెలిపారు. రైల్వేకు ఎనిమిదేళ్లలో తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత కల్పించిందన్నారు. వందే భారత్ రైలు ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. ప్రధాని జెండా ఊపి ప్రారంభించడంతో రైలు బయలుదేరి వెళ్లింది. ఈ కార్యక్రమంలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తదితరులు పాల్గొన్నారు.


Tags:    

Similar News