రేపు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం

వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ను రేపు ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించనున్నారు.

Update: 2023-01-14 02:18 GMT

వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ను రేపు ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య ఈ రైలు నడవనుంది. గంటలకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైలును సంక్రాంతి సందర్భంగా రేపటి నుంచి అందుబాటులోకి రానుంది. కేవలం 8 గంటల్లోనే సికింద్రాబాబ్ నుంచి విశాఖకు చేరుకుంటుంది. ట్రయల్ రన్ ఇప్పటికే పూర్తయింది. రేపు ఉదయం 10.30 గంటలకు మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు.

రైలు బయలుదేరేదిలా...
సికింద్రాబాద్ బయలుదేరే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఖమ్మం, వరంగల్, విజయవాడ, రాజమండ్రి స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. ఆదివారం మినహా మిగిలిన ఆరురోజుల్లో ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. సికింద్రాబాబ్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం మూడుగంటలకు బయలుదేరి రాత్రి 11.30 గంటలకు విశాఖకు చేరుకుంది. విశాఖలో 5.45 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.45 గంటలకు సికింద్రాబాద్ కు చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.


Tags:    

Similar News