మునుగోడులో ఇంత అరాచకమా?

మునుగోడు ఉప ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని, నిబంధనలను అధికార పార్టీ ఉల్లంఘిస్తుందని కోదండరామ్ అన్నారు;

Update: 2022-10-25 12:50 GMT
మునుగోడులో ఇంత అరాచకమా?
  • whatsapp icon

మునుగోడు ఉప ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని, ఎన్నికల నిబంధనలను అధికార పార్టీ ఉల్లంఘిస్తుందని ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ఆయన బుద్ధభవన్ లోని ప్రధాన ఎన్నికల కార్యాలయంలో మౌనప్రదర్శన చేశారు. విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నా అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నికల నిబంధనలను అధికార పార్టీకి అనువుగా అధికారులు మార్చారని ఆయన ఆరోపించారు.

వెయ్యి కోట్లను...
రాజ్యాంగ బద్ధంగా ఎన్నికలు జరగాల్సి ఉండగా వాటికి తిలోదకాలిచ్చారని తెలంగాణ జనసమితి అధినేత మండి పడ్డారు. తాము ఈ ఎన్నికను రద్దు చేయాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని కోదండరామ్ తెలిపారు. అధికార పార్టీకి చెందిన వారు అలివి కాని హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీలు ఖర్చు చేస్తున్న వెయ్యి కోట్ల రూపాయలను నియోజకవర్గం అభివృద్ధికి వినియోగించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.


Tags:    

Similar News