Telangana Speaker : తెలంగాణ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్
తెలంగాణ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యినట్లు ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ప్రకటించారు
తెలంగాణ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికయ్యినట్లు ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. స్పీకర్ గా అధికారికంగా ప్రకటించడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను ఛెయిర్ లో కూర్చోబెట్టి అభినందించారు. అనంతరం మంత్రులు, ప్రతిపక్ష సభ్యులు ఆయనకు అభినందనలు తెలిపారు.
తొలుత ప్రమాణ స్వీకారం...
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన వెంటనే కొందరు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ స్పీకర్ ఎన్నికపై ప్రకటన చేశారు.