పోలీసు కమిషనర్‌ను అడ్డుకున్న మహిళ కానిస్టేబుల్

రాచకొండ పోలీస్ కమిషనర్ చౌహాన్ పదో తరగతి పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.

Update: 2023-04-06 04:56 GMT

రాచకొండ పోలీస్ కమిషనర్ చౌహాన్ పదో తరగతి పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. ఎల్బీనగర్‌లోని పలు పరీక్ష కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. అయితే రాచకొండ సీపీ చౌహాన్ ఒక పరీక్ష కేంద్రంలోకి మొబైల్ ఫోన్‌తో వెళుతుండగా మహిళ కానిస్టేబుల్ సీపీని అడ్డుకున్నారు. పరీక్ష కేంద్రంలోకి సెల్‌ఫోన్లకు అనుమతి లేదని ఇప్పటికే ఆదేశాలు జారీ అయిన సంగతి తెలిసిందే.

కానిస్టేబుల్‌కు రివార్డు...
దీంతో పోలీస్ కమిషనర్ చౌహాన్ అక్కడ విధినిర్వహణలో ఉన్న మహిళ కానిస్టేబుల్‌కు తన సెల్‌ఫోన్ ను ఇచ్చి లోపలకి వెళ్లారు. ఇది చూసిన పోలీసు అధికారులు కొంత షాక్‌కు గురయ్యారు. అయితే పరీక్ష కేంద్రం నుంచి తిరిగి వచ్చిన చౌహాన్ మహిళ కానిస్టేబుల్ ను అభినందించారు. ఆమెకు రివార్డు అందచేశారు.


Tags:    

Similar News