కాకతీయ యూనివర్సిటీలో 78 మంది విద్యార్థుల సస్పెండ్

యూనివర్సిటీలో పెద్ద సంఖ్యలో విద్యార్థులను హాస్టల్స్ నుంచి సస్పెండ్ చేయడం

Update: 2023-12-23 03:19 GMT

KakatiyaUniversity

కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ చేసిన సీనియర్లను అధికారులు సస్పెండ్ చేశారు. కామర్స్, జువాలజీ, ఎకనామిక్స్ విభాగాలకు చెందిన విద్యార్థి, విద్యార్థినులు ఈ జాబితాలో ఉన్నారు. యూనివర్సిటీలో పెద్ద సంఖ్యలో విద్యార్థులను హాస్టల్స్ నుంచి సస్పెండ్ చేయడం ఇదే తొలిసారి కావడంతో చర్చనీయాంశమైంది. పరిచయాల పేరుతో జూనియర్లపై పీజీ చివరి సంవత్సరం విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడ్డారని తేలడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. 78 మంది విద్యార్థులను వారం రోజులపాటు హాస్టల్స్ నుంచి సస్పెండ్ చేశారు. వర్సిటీ క్యాంపస్‌లోని హాస్టల్స్ సంచాలకులు, కళాశాల ప్రిన్సిపల్‌, ఇతర అధికారులు స్పందించి ర్యాగింగ్ కు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకున్నారు. ర్యాగింగ్‌కు పాల్పడ్డ విద్యార్థుల వివరాలు సేకరించారు. పద్మావతి ఉమెన్స్ హాస్టల్‌తోపాటు ఇతర అన్ని విభాగాల్లోనూ ర్యాగింగ్‌ జరిగినట్టు నిర్ధారించుకున్నాక సస్పెన్షన్ వేటు వేశారు. పద్మావతి మహిళా వసతి గృహంలో ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థినుల వివరాలు సేకరించారు. ఇతర విభాగాల్లోనూ ర్యాగింగ్‌ జరుగుతున్నట్లు గుర్తించారు.

విద్యార్థులు ర్యాగింగ్ లో భాగమయ్యారని తేలగానే తక్షణమే వసతి గృహాలను ఖాళీ చేయాలని సూచించామని వర్సటీ అధికారులు తెలిపారు .కేయూ హాస్టల్స్ సంచాలకులు ప్రొఫెసర్ వై వెంకయ్య మాట్లాడుతూ ర్యాగింగ్ కు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నామని, సరైన ఆధారాలు లభిస్తే మిగిలిన విద్యార్థులను కూడా హాస్టల్స్ నుంచి సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. శనివారం నుంచి ఈ నెల 31 వరకు కాకతీయ విద్యార్థులకు క్రిస్మస్‌ సెలవులు ప్రకటించారు.


Full View


Tags:    

Similar News