రోశయ్య మృతిపై రాహుల్ ఫోన్ లో?
రోశయ్య మృతిపట్ల రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని ఆయన అన్నారు
రోశయ్య మృతిపట్ల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని ఆయన అన్నారు. రోశయ్య కుమారుడు శివకు ఫోన్ చేసి రాహుల్ గాంధీ పరామర్శించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని రాహుల్ గాంధీ ఆకాంక్షించారు. కేవీపీ రామచంద్రరావుకు కూడా రాహుల్ ఫోన్ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
చివరి సారి చూసేందుకు...
అంతేకాకుండా రోశయ్య పార్థీవదేహాన్ని చివరి సారి చూసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పార్టీ కార్యకర్తలు, అభిమానులు చేరుకుంటున్నారు. రేపు ఉదయం వరకూ రోశయ్య పార్థీవ దేహం అమీర్ పేట్ లోనే ఉండనుంది. రేపు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి.